పేలిన రిఫ్రిజిరేటర్‌ .. వంట సామగ్రి దగ్ధం

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముత్యాలమ్మపేటలో సోమవారం ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలింది. డి. లక్ష్మణ్ నాయుడు అద్దెకు ఉంటున్న ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. రిఫ్రిజిరేటర్ పేలడంతో బీరువా, ఏసీ, వంట సామగ్రి దగ్ధమయ్యాయి. స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్