AP: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గుడివాడలో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు కొడాలి నానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఆయనపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.