చైల్డ్ కేర్ లీవ్స్ పిల్లల వయోపరిమితి తొలగింపు

AP: ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంపై ఉన్న పిల్లల వయోపరిమితి నిబంధనను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఉద్యోగులు 180 రోజుల సెలవులను 10 విడతల్లో తమ సర్వీసులో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. గతంలో పిల్లల వయసుతో ఈ సెలవులను వాడుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చైల్డ్ కేర్ లీవ్స్ మహిళా, వితంతు, విడాకులు తీసుకున్న, ఒంటరి పురుష ఉద్యోగులకు వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్