బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రముఖ డాక్టర్ లావణ్య మృతి

AP: నెల్లూరు జిల్లా, టీడీపీ సీనియర్ నేత కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ కుమార్తె డాక్టర్ కుంకాల లావణ్య (31) శనివారం బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందారు. మాగుంట లేఅవుట్‌లో ఎనెల్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్, న్యూరాలజిస్ట్‌గా ఆమె సేవలందిస్తున్నారు. తక్కువ ఫీజులతో పేదలకు వైద్య సేవలు అందిస్తూ గుర్తింపు పొందిన ఆమె, వారం క్రితం జైపూర్‌లో జరిగిన 33వ ఇండియన్‌ అకాడమి ఆఫ్‌ న్యూరాలజీ వార్షిక సదస్సులో తన వ్యాసానికి ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕