లడ్డూ నెయ్యిలో బీఫ్‌, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని నివేదిక వచ్చింది: పవన్‌

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఆలయాల వద్ద ఏం జరిగినా, అవన్నీ పిచ్చోళ్ల పనుల్లా జరిగాయని విమర్శించారు. లడ్డూ కల్తీ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురాకపోతే అది తప్పు అవుతుందని భావించి అన్ని కోణాల్లో ఆలోచించి మాట్లాడామని తెలిపారు. ఎన్‌డీడీబీ నివేదికను చంద్రబాబు చదివి వినిపించారని, లడ్డూ నెయ్యిలో బీఫ్‌, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు నివేదికలో తేలిందని పవన్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్