AP: స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సామాన్యులను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ అని, తాము తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఇకపై మూడు రాజధానుల వ్యవహారం ఉండదని, అమరావతి హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.