ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరలను దృష్టిలో ఉంచుకుని, పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం 'ధరణి' బ్రాండ్ పేరుతో సన్నబియ్యం పంపిణీని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్ల ద్వారా 26 కిలోల బియ్యం బస్తాను రూ.1300లకే విక్రయిస్తున్నారు. అర్హులైన వారికి మాత్రమే ఈ బియ్యం అందేలా ఆధార్ కార్డు అనుసంధానం చేశారు. కొనుగోలుదారుల పేరు, ఆధార్ మరియు మొబైల్ నంబర్లను నమోదు చేస్తున్నారు.