పులివెందులలో బ‌య‌ట‌ప‌డ్డ రిగ్గింగ్

AP: పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇతరుల కేటగిరీలో కేవలం 14 మంది ఓటర్లు మాత్రమే ఉండగా, ఎన్నికల అధికారుల డేటా ప్రకారం ఏకంగా 681 ఓట్లు నమోదయ్యాయి. కేవలం 14 మందికి 681 మంది ఎలా ఓటు హక్కు వినియోగించుకున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఓటర్ల జాబితాను సరిచూసుకోకుండానే అక్రమంగా ఓటింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕