ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా వరద పెరుగుతోంది. ఇప్పటికే 15 గేట్లను 7 అడుగులు మేర, 55 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. బ్యారేజీకి మొత్తం ఇన్ ఫ్లో 2,77,784 క్యూసెక్కులు ఉండగా.. దిగువకు 2,60,875 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.