అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

AP: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న జైనుల్లా, మహబూబ్‌బాషా, బాషా మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕