AP: విజయవాడ పశ్చిమ బైపాస్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు రాజమండ్రికి చెందిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్, మార్కాపురం జిల్లాకు చెందిన వీఆర్ఏ గురవయ్యగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.