AP: 'ఓటుకు నోటు' సంస్కృతికి చంద్రబాబే పితామహుడని, అలాంటి వ్యక్తి మహిళలు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఆదివారం నగరిలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో మహిళలు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారని, అలాంటి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నట్టుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రోజా తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకున్న తర్వాతే మహిళలకు నీతులు చెప్పాలని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి డబ్బును ఉపయోగించారన్నారు.