టీచర్లపై దాడి కేసులో వైసీపీ నేతలు సహా పలువురిపై రౌడీషీట్

AP: విజయవాడలో టీచర్లపై జరిగిన దాడి కేసులో వైసీపీ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్ సహా 51 మందిపై రౌడీషీట్ తెరవాలని సీపీ రాజశేఖర్‌ బాబు ఆదేశించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఉన్న వారందరిపైన కూడా రౌడీషీట్లు తెరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాప్ కార్యాలయం దగ్గర మెగా DSC ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులుగా ఉన్న కొందరు, టీచర్లపై దాడి కేసులోనూ ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండు చోట్లా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరవాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕