AP: తిరుపతిలో ట్రావెల్స్ మేనేజర్‌పై రౌడీ షీటర్ దాడి చేశాడు. చెర్లోపల్లి అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సుండుపల్లి మండలం మంచిరెడ్డిపల్లికి చెందిన చంద్రమోహన్ పుదీపట్ల కృష్ణ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారికి హారన్ కొట్టాడని అడ్డగించి దాడి చేశారు. అజీమ్ అనే రౌడీషీటర్, మరో ఇద్దరు మేనేజన్ను చంపేస్తానని బెదిరించి.. ఫోన్ పగలగొట్టి, మెడలో గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయారు.