హజ్ యాత్రికులకు రూ. లక్ష సాయం: సీఎం చంద్రబాబు

AP: ముస్లింలకు సీఎం నారా చంద్రబాబు శుభవార్త అందించారు. మంగళవారం విజయవాడలోని మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అంతేకాక, కడప, విజయవాడలలో హజ్ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు

సంబంధిత పోస్ట్