చిట్టీల పేరుతో రూ.10 కోట్లు మోసం.. పరారైన నిర్వాహకుడు

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని రూ.10 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గత ఆరు నెలలుగా చిట్టీల డబ్బులు చెల్లించకుండా తప్పించుకున్న శ్రీనివాసరావు, తన ఇంటిని కూడా అమ్ముకుని పారిపోయినట్లు బాధితులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. ప్రజలు చిట్టీలు, ఫైనాన్స్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్