AP: స్త్రీశక్తి పథకం వర్తించే 5 రకాల బస్సుల్లో విధులు నిర్వర్తించే ఆన్‌కాల్ డ్రైవర్లకు చెల్లించే మొత్తాన్ని రూ.800 నుంచి రూ.1,000కి పెంచుతూ గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి ఆర్టీసీ బోర్డు ఆమోదం తెలిపింది. ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదోన్నతులు కల్పించడంపై చర్చించారు.