AP: కడపలోని హ్యుందాయ్ షోరూమ్‌లో జరిగిన రూ.13.30 కోట్ల స్కాం కేసులో చిన్న చౌక్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆడిటర్ రాంబాబు, అకౌంటెంట్ రాజేశ్, క్యాషియర్ మహమ్మద్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్ల నుంచి కంపెనీకి రావాల్సిన నగదును నిందితులు తమ సొంత ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను ఆధారాలతో కోర్టులో హాజరుపరిచి రిమాండు తరలించారు.