ఏపీలో మహిళలకు నెలకు రూ.1500 చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18,000 అందిస్తామని తెలిపారు. మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయం విషయంలో ఎవరికీ అన్యాయం చేయమని స్పష్టం చేశారు. విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని ఆమె వెల్లడించారు.