AP: ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి అర్హులుగా గుర్తిస్తారు. దరఖాస్తుదారు వివరాలను ఆవాస్ ప్లస్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు.