ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20 వేలు: మంత్రి

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20,000 అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గానూ మత్స్యకారులకు ఈ సొమ్ము అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే, మే నెలలో 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు రైతులకు అందించనుంది.

సంబంధిత పోస్ట్