AP: రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కానున్న ఈ పథకం ద్వారా, ఎంపికైన విద్యార్థులకు రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. గతంలో ఉన్న నిబంధనలను సడలించి, ప్రపంచంలోని టాప్ 250 యూనివర్సిటీలలో చదివే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.