జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా: అచ్చెన్నాయుడు

ఏపీలో జనవరి నుంచి పేదలకు రూ.25లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని తెదేపా కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.2.10కోట్ల సాయాన్ని సీఎం సహాయనిధి ద్వారా అందించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్