టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.273.79 కోట్లు విడుదల

AP: సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న టిడ్కో గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.273.79 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో లబ్ధిదారుల కాలనీలలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి వంటి పనులు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్