AP: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీపై గంటల తరబడి మాట్లాడుతున్న జగన్ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో రూ.3,200 కోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు.