AP: గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. APSPDCL సంస్థ అప్పటి ఛైర్మన్ సంతోష్ రావు హయాంలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని, 2023లోనే ఈ అవినీతి బయట పడిందన్నారు. ప్రభుత్వం మారినా సంతోష్ రావు కొనసాగారని, నిధుల దుర్వినియోగంపై ఆర్టీఐ కింద అడిగినా సమాచారం ఇవ్వలేదని అన్నారు. తాము అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు.