ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియలో భాగంగా, రెండో విడత నిధులను అక్టోబర్లో విడుదల చేయాలని యోచిస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ రెండో విడతలో ఒక్కో రైతుకు రూ.4 వేలు అందనున్నాయి. ఇప్పటికే జూన్లో తొలి విడతగా రూ.5 వేలు చొప్పున 46,85,838 మంది రైతులకు రూ.3,125.47 కోట్లు విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు కూడా అక్టోబర్లోనే జమ కానున్నాయి. దీంతో ఏపీ రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.6 వేలు జమ కానున్నాయి.