ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధుల జమపై క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ 2న సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనుండగా.. ఆ రోజే ఈ పథకం నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన కింద ఆగస్ట్ 2 అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో రూ. 3,156 కోట్లు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరో రెండు రోజుల్లో ఖాతాల్లో రూ.7 వేలు జమ కానున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.