AP: ‘అన్నదాత సుఖీభవ పథకం' కింద కూటమి సర్కార్ అర్హులైన రైతుల ఖాతాల్లో త్వరలో రూ.7 వేలు జమ చేయనుంది. ఈ మేరకు ఇటీవల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, రైతులు తమ ఆధార్ నంబరును 9552300009 అనే మనమిత్ర వాట్సప్ నంబరుకు పంపితే తగిన సమాచారం వస్తోంది. జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నారని అనుకుంటే, రైతులు అర్జీతో పాటు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ లోగా అప్లై చేసుకోవచ్చు.