AP: పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల అకౌంట్లోకి కేంద్రం రూ.2 వేల చొప్పున జమ చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసే ఛాన్సుంది. రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. దాంతో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతుల అకౌంట్లోకి రూ.7 వేలు జమ అయ్యే అవకాశం ఉంది.