AP: అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ.7,000 ఈ నెలలోనే జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హుల జాబితాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వగా.. ఆ గడువు నేటి(జులై 13)తో ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు అర్జీలు ఇవ్వని రైతులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.