రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారీ వర్షానికి భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. ఈదురుగాలులు, భారీ వర్ష ప్రభావంతో ఓ ఇంటి గోడ కుప్పకూలింది. అప్పటికే ఒక వ్యక్తి గేటు మూసే ప్రయత్నంలో ఉండగా, అకస్మాత్తుగా గేట్‌తో పాటు గోడ కూడా ఒక్కసారిగా కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు సదరు వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.