AP: భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. వరద నీటితో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోపాలపురం-తాళ్లపూడి రోడ్డులో పెద్దాపురం వద్ద ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. తాళ్లపూడి పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక రైతుల సహకారంతో ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపి.. ట్రాక్టర్ల సహాయంతో బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.