AP: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద పెను ప్రమాదం తప్పింది. గోకవరం డిపోకి చెందిన బస్సు కాకినాడ నుంచి గోకవరం వస్తుండగా వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు సగభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.