తిరుమలలో భక్తులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

AP: తిరుమలలో భక్తులకు శుభవార్త. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరి తెలిపారు. ఇప్పటికే టీటీడీ నడిపే ధర్మ రథాలకు అదనంగా ఈ సేవలను ప్రారంభించారు. ధర్మరథాల రూట్‌లోనే ఆర్టీసీ బస్సుల సేవలు కొనసాగుతాయి. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలు, ట్రాఫిక్ నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకటయ్య చౌదరి తెలిపారు.

సంబంధిత పోస్ట్