సాయి కృష్ణ కేసు.. రిమాండ్ రిపోర్ట్ విడుదల

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్య రిమాండ్ రిపోర్ట్ విడుదలైంది. సాక్షాలను మాయం చేయడంలో వీరు కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు తెలిపారు. కృష్ణలంక పీఎస్ సీసీటీవీ, హార్డ్ డిస్క్‌లు మార్చారని, సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుందో తెలియదని పేర్కొన్నారు. నిందితులు విచారణకు సహకరించడంలేదని, కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని, పోలీసులు కావడంతో సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్