సాయికృష్ణ కేసు.. సాక్ష్యాలు సేకరిస్తున్న సిట్

AP: కృష్ణలంక సాయికృష్ణ మృతి కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అప్రూవర్లుగా మార్చేందుకు సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కాగా, మరికొందరిని నిందితులుగా చేర్చనుంది. ఈ మేరకు సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చిన తర్వాత కృష్ణలంక స్టేషన్‌లోని రెండో అంతస్తులో ఉంచినట్లు విచారణలో తేలింది. ఎక్కువ మంది సిబ్బందికి తెలియకుండా ఉండేందుకు అక్కడ ఉంచినట్లు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్