AP: సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు దర్యాప్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అతడిని కస్టడీలో చిత్రహింసలు పెట్టి కొట్టడంతోనే సాయికృష్ణ చనిపోయాడని సిట్ తేల్చింది. ఆ తర్వాత అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని శ్మశానికి తరలించి దహనం చేసి, సాక్ష్యాలు లేకుండా మాయం చేశారని స్పష్టం చేసింది. హైకోర్టులోనూ తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేశారని సిట్ పేర్కొంది. ఈ మేరకు సిట్ ఏడుగురిని నిందితులుగా, 120 మందిని సాక్షులుగా చేర్చింది. ఈ మేరకు కోర్టులో సిట్ అభియోగపత్రం దాఖలు చేసింది.