సాయికృష్ణ లాకప్ డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది: జగన్

AP: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్రాన్ని కుదిపేసిందని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా.. ‘సాయికృష్ణ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దాన్ని సోషల్ మీడియాలో చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్యల కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి’ అని జగన్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్