కడప జిల్లా పులివెందులలో YCP సోషల్ మీడియా విభాగం బాధ్యుడు సజ్జల భార్గవరెడ్డిపై పోలీసుల విచారణ రెండో రోజుకు చేరింది. CM చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు భార్గవరెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. శనివారం సుమారు 8 గంటల పాటు విచారించిన పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, ఇవాళ మధ్యాహ్నం మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.