వైసీపీకి సజ్జల రామకృష్ణా రెడ్డి గుడ్ బై?

AP: సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో 'షాడో బాస్'గా కీలక పాత్ర పోషించిన ఆయన, పార్టీని వీడుతున్నారనే వార్తల్లో ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. విజయసాయిరెడ్డి లేఖల తదనంతర పరిణామాల వేళ ఈ ఊహాగానాలు వచ్చినా, సజ్జల మాత్రం మెగా డీఎస్సీ అంశంపై ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రత్యర్థి పార్టీల వ్యూహమా లేక నిజంగానే ఆయన ప్యాకప్ చెప్తున్నారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕