సజ్జల సలహాలే జగన్‌ను 11 సీట్లకు తెచ్చాయి: బీటీ నాయుడు

AP: సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సజ్జల సలహాల వల్లే వైఎస్ జగన్ 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయారని నాయుడు ఆరోపించారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరావతిని 'భ్రమరావతి', 'శ్మశానం' అంటూ గత ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని, ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఎన్నికల్లో వైసీపీకి రెండు అంకెల సీట్లే ఇచ్చారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్