AP: కూటమి ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూములను, ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేటు సంస్థలు అమ్ముకునేందుకు, బదిలీ లేదా లీజుకు ఇచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2012 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ నిబంధనలను పక్కన పెడుతూ ఈ ఉత్తర్వులు తీసుకురావడం గమనార్హం. వివాదాస్పద భూములను సైతం విక్రయించడానికి అనుమతిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వదులుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.