AP: ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచనల్లోంచి వచ్చిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో మాట్లాడారు. ‘లోకేశ్ బాగా చదువుకుని మంత్రి అయ్యాడు. తల్లికి వందనం ఇచ్చాడు. ఇది ఒక ప్రభుత్వ విధానమని, అది ఎలా వచ్చింది. ఆయన ఆలోచనల్లోంచి వచ్చింది’ అని CBN అన్నారు.