AP: ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా 35,44,459 మంది తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున నగదు జమ ప్రారంభమైంది. దీంతో 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేరనుంది. ఈ మేరకు నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితా ఉంటుందని, 20వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చని చెప్పింది. జూన్ 30న తుది జాబితా ప్రదర్శించి, మిగిలిన అర్హులకు జులై 5న నగదు పంపిణీ చేస్తామని పేర్కొంది.