AP: శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని మాట్లాడారు. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని.. తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. మన ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని, మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులే అని ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.