'తల్లికి వందనం' రూ.13వేలు.. నగదు జమకాని వారికి మరో ఛాన్స్?

AP:'తల్లికి వందనం' పథకానికి సంబంధించి నగదు జమకాని లబ్ధిదారులు కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
నవంబర్ 13, 2025 లోపు తమ బ్యాంకు వివరాలు సరిచేసుకోవాలని, ఆధార్ లింకింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించింది. అర్హుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ డబ్బులు రానివారు, వెంటనే దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి, తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు కోరారు. కాగా, ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్