సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్ కల్యాణ్

కర్ణాటకలోని ఉడుపి పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, అది ఆధ్యాత్మిక శాస్త్రమని తెలిపారు. తమిళనాడులో సనాతన ధర్మాన్ని అనుసరించేందుకు న్యాయపోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి హిందువులో చైతన్యం అవసరమన్నారు. భగవద్గీత ఏ ప్రాంతమో, ఏ మతానికో చెందిన గ్రంథం కాదని, ముఖ్యంగా యువత తప్పనిసరిగా గీత చదవాలని సూచించారు. మనసు కుంగినప్పుడు గీత కౌన్సిలర్, మెంటర్‌లా మారుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్