ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు..కీలక అప్డేట్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు (సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు) కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల SEC నీలం సాహ్ని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని SEC యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్