ఏపీలో సర్పంచ్ ఎన్నికలు.. BIG UPDATE

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం 2026 మార్చిలో ముగియనుండగా.. ఏప్రిల్‌తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రామ పంచాయతీల విభజనపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది.

సంబంధిత పోస్ట్